చైనా ఓపెన్ సిరీస్ నుంచి నిష్క్ర‌మించిన పీవీ సింధు

  • చైనా క్రీడాకారిణి గావో ఫాంగ్జీ చేతిలో ఓట‌మి
  • 21-11, 21-10 తేడాతో ఓట‌మి పాలైన సింధు
  • చైనా ఓపెన్‌లో ముగిసిన భార‌త ప‌ర్వం
చైనా ఓపెన్ సూప‌ర్ సిరీస్ బ్యాడ్మింట‌న్‌లో క్వార్ట‌ర్‌కి చేరుకున్న భార‌త స్టార్ షట్ల‌ర్ పీవీ సింధు, చైనా క్రీడాకారిణి గావో ఫాంగ్జీ చేతిలో ఓట‌మి పాలై నిష్క్ర‌మించింది. 38 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 21-11, 21-10 తేడాతో సింధు ఓట‌మి పాలైంది. దీంతో చైనా ఓపెన్‌లో భార‌త ప‌ర్వం ముగిసిన‌ట్లైంది. ఇత‌ర భార‌త ష‌ట్ల‌ర్లు సైనా నెహ్వాల్‌, హెచ్ఎస్ ప్ర‌ణ‌య్‌లు ప్రీక్వార్ట‌ర్‌లోనే నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే.

గ‌త మూడు వారాల నుంచి డెన్మార్క్ ఓపెన్‌, ఫ్రెంచ్ ఓపెన్‌, నాగ్‌పూర్‌లో జాతీయ ఛాంపియ‌న్‌షిప్‌ల‌లో ఆడిన సింధు, గావో ఫాంగ్జీతో జ‌రిగిన మ్యాచులో కొంత ఇబ్బందిప‌డిన‌ట్లుగా క‌నిపించింది. చిన్న చిన్న త‌ప్పులు చేయ‌డం, ప్ర‌త్య‌ర్థిని తిక‌మ‌క పెట్ట‌డంలో సింధు ఇబ్బందులు ఎదుర్కున్న‌ట్లు అనిపించింది.
Go Back to Shorts
china open
china
gao fangjie
PV Sindhu
india
shuttlers
badminton

More Telugu News